చీరాల : కీర్తివారిపాలెం, పెర్లవారిపాలెం గ్రామాల్లో మంగళవారం జరిగిన పొలం పిలుస్తుంది గ్రామసభల్లో రైతులకు భూసార పరీక్షల పత్రాలను వ్యవసాయాధికారులు పంపిణీ చేశారు. భూసార పరీక్ష ఫలితాల విశ్లేషణ ఆధారంగా సూక్ష్మపోషకాలైన జింక్, జిప్సం, బోరాన్ వంటివి నూరుశాతం రాయితీపై అందజేస్తున్నట్లు తెలిపారు. పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పంటల భీమా చేయించుకోవాలని చెప్పారు. వ్యవసాయ యాత్రీకరణ ద్వారా వ్యవసాయ పరికరాలు అవసరమైన రైతులు తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపిఇఒలు సాంబశివరావు, ప్రసన్నకుమారి పాల్గొన్నారు.