Home ఆంధ్రప్రదేశ్ బెజ‌వాడ‌లో రాజ‌కీయ కాక‌రేపుతున్న ప్లెక్సీలు

బెజ‌వాడ‌లో రాజ‌కీయ కాక‌రేపుతున్న ప్లెక్సీలు

465
0

విజయవాడ : న‌గ‌రంలో టిడిపి, జ‌న‌సేన ప్లెక్సీలు ఉత్కంఠ‌ను రేపుతున్నాయి. టిడిపి నేత కాట్రగడ్డ బాబు ఫ్లెక్సీలకు పోటీగా జనసేన నాయకులు మండలి రాజేష్ ఫ్లెక్సీలు కట్టారు. కాట్రగడ్డ బాబు గత నెల రోజులుగా న‌గ‌రంతోపాటు ప‌రిస‌ర ప్రాంతాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను విమ‌ర్శిస్తూ ప్లెక్సీలు క‌ట్టించారు. దీనికి పోటీగా జనసేన నేత‌లు ఏర్పాటు చేసిన‌ ఫ్లెక్సీలు ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి. 2009 ఎన్నిక‌ల్లో టిడిపి పరిస్థితి ఏమిటి..? 2014 ఎన్నిక‌ల్లో టిడిపి అధికారానికి రావ‌డానికి కారణం ఏమిటి? తెలుగు తమ్ముళ్లు ఆలోచించుకోవాలంటూ జ‌న‌సేన నేత‌ల‌ ఫ్లెక్సీల్లో ప్ర‌శ్నించారు. ఒక‌రిని ఒక‌రు రెచ్చ‌గొట్టుకుంటూ ఏర్పాటు చేసిన ప్లెక్సీల‌పై పోలీసులు దృష్టి పెట్టారు. రెండు పార్టీల నేతల‌కు కౌన్సిలింగ్ ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తుంది.