అమరావతి : శాసన మండలి సమావేశాలు రెండో రోజు ప్రారంభంలో పిడిఎఫ్ ఎంఎల్‌సిలు సిపిఎస్ విధానం రద్దు చేయాలని డిమాండు చేశారు. సిపిఎస్ రద్దుచేయాలంటూ సభలో నినాదాలు చేస్తూ పోడియం వద్దకు వెళ్లారు. దీనిపై వాయిదా తీర్మానం ఇచ్చారు. పిడిఎఫ్ ఎంఎల్‌సిలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్ ఫరూక్ తిరస్కరించారు. దీంతో ఎంఎల్‌సిలు పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. సిపిఎస్ రద్దుపై మండలిలో స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. అప్పటి వరకు నిరసన ఆపేది లేదని పేర్కొన్నారు. పిడిఎఫ్ ఎంఎల్‌సిల వాదనకు మంత్రి అచెన్నాయుడు స్పందించారు. సిపిఎస్ విధానంపై ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తుందని చెప్పారు. సిపిఎస్ ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదన్నారు. అయినప్పటికీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని అచెన్నాయుడు సభ్యులకు హామీ ఇచ్చారు.