Home ఆంధ్రప్రదేశ్ పిడిఎఫ్ మాజీ ఎమ్మెల్సీ జార్టివిక్టర్‌ మృతి

పిడిఎఫ్ మాజీ ఎమ్మెల్సీ జార్టివిక్టర్‌ మృతి

711
0

అమ‌రావ‌తి : మాజీ శాసనమండలి సభ్యులు, యుటిఎఫ్‌ తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు కచ్చా జార్జి విక్టర్‌ (67) రాజ‌మండ్రి ప్ర‌వేటు వైద్య‌శాల‌లో చికిత్స పొందుతూ శుక్ర‌వారం మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా ఎదురుపాక స్వగ్రామానికి చెందిన ఆయ‌న‌ సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించారు. 2001లో స్కూల్‌ అసిస్టెంట్‌గా ప‌దోన్న‌తి పొందారు. శాసనమండలి పునరుద్ధరణ చేసిన తరువాత 2007లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా గ్రాడ్యుయేట్‌ నియోజక వర్గం నుండి ఎంఎల్‌సిగా ఎన్నిక‌య్యారు. 2013 వరకు ఎంఎల్‌సిగా కొనసాగారు. శాసన మండలిలో పిడిఎఫ్‌ విప్‌గా వ్యవహరించారు. ఉపాధ్యాయులుగా పనిచేసిన కాలంలో తూర్పుగోదావరి జిల్లా యుటిఎఫ్‌ అధ్యక్షులుగా ఉపాధ్యాయుల సమస్యల రిష్కారానికి కృషి చేశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయ‌న‌ రాజమండ్రి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు (31.08.2018) ఉదయం తుదిశ్వాస విడిచారు.