రాచర్ల : మండలంలోని జె.పుల్లలచెరువు గ్రామ నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ నెమలిగుండ్ల రంగస్వామి దేవాలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసం కావడంతోపాటు శనివారం కావడంతో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు ఉన్న భక్తులు తలనీలాలు సమర్పించారు. పుణ్య స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నారు.