బాపట్ల : పట్టణంలోని కాపు కళ్యాణ మండపంలో టిడిపి మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్న ఎంఎల్‌సి అన్నం సతీష్‌ప్రబాకర్ జిల్లాలో మంచి గుర్తింపు, పేరు తెచ్చుకున్నారని పలువురు నాయకులు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపించుకొని తీరుతామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఒక నాయకుడు టిడిపిని, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిందేకాకుండా తానే టిడిపి నాయకుడనని చెప్పుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. అతని మాటలు నమ్మవద్దని చెప్పారు. పార్టీ పేరు చెప్పుకుని వ్యాపారాభివృద్ది చేసుకుంటున్నారని టిడిపి పట్టణ అధ్యక్షులు తానికొండ దయాబాబు ఆరోపించారు.
అన్నం సతీష్ ప్రభాకర్‌ను అడ్డుకోవాలని చేసే ప్రయత్నాలు చెల్లవన్నారు. పార్టీలో పగటి వేషగాళ్లను నమ్మవద్దన్నారు. ఐక్యంగా అన్నం సతీష్ గెలుపుకు కృషి చేయాలని కోరారు.