చీరాల : తెల్ల కార్డు ఉన్నవారికి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలను శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు ఉచితంగా పొందవచ్చని, ప్రస్తుతం ఒక్క రోజులోనే ఆపరేషన్ చేయడానికి కావలసిన పర్మిషన్ ట్రస్ట్ నుండి వస్తున్నదని కామాక్షి కేర్ ఆస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తాడివలస దేవరాజు పేర్కొన్నారు. 10వ తేదీ మంగళవారం జరుగు ఉచిత మెగా వైద్య శిబినాన్ని వినియోగించుకోవాలని కోరారు.
శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఆవరణలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలపై అవగాహన సదస్సు, 10వ తేదీ మంగళవారం శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఆవరణలో జరుగు ఉచిత వైద్య శిబిరం గురించి తెలియజేశారు. డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో జనరల్ ఫిజీషియన్ డాక్టర్ జి నవీన్ ఎముకల స్పెషలిస్ట్ డాక్టర్ దివ్య, జనరల్ సర్జన్ డాక్టర్ గావిని లక్ష్మీనారాయణ, యూరాలజిస్ట్ డాక్టర్ కృష్ణారావు, కంటి వైద్య నిపుణులు డాక్టర్ కుమార్, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొంటారని తెలిపేరు.
ఈ వైద్య శిబిరంలో అన్ని రకాల ఎముకల ఆపరేషన్ లు, జనరల్, లాప్రోస్కోపి ఆపరేషన్ లు, కిడ్నీ రాళ్ల ఆపరేషన్ లు, చెవి, ముక్కు, గొంతు ఆపరేషన్ లు, కంటి శుక్లాల ఆపరేషన్లు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చేస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలను బాపట్ల, పర్చూరు, చీరాల ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.