చీరాల : ఈపురుపాలెం చేనేత సామాజికవర్గానికి చెందిన శ్రీరామదాసు సైగణేష్ తన ఇంటి సమీపంలోని ఆకురాతి తనుజ ప్రేమించుకున్నారు. హైదరాబాద్ ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ చీరాల వచ్చి డిఎస్పీ ద్వారా పోలీసుల రక్షణ కోరారు. అయితే వివాహం చేసున్న యువతి పోలీసుల సమక్షంలో మౌనం వహించడంతో ఇద్దరిని వారి వారి ఇళ్లకు పంపించారు.
సాయిగానేశ్ మంగళవారం తన ఇంటిలో నిద్రిస్తుండగా యువతి బంధువులు దాడిచేశారు. దాడిలో గణేష్ తలకు తీవ్ర గాయమైనది. గమనించిన యువకుని బంధువులు వైద్యచికిత్సా నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.