Home ఆంధ్రప్రదేశ్ అనైక్యతతో బజారుకీడ్చారు : చంద్రబాబు ఆగ్రహం

అనైక్యతతో బజారుకీడ్చారు : చంద్రబాబు ఆగ్రహం

478
0

ఒంగోలు : “గతంలో 35వేల మెజారిటీ ఉన్న కొండేపి నియోజకవర్గాన్ని ఇప్పుడు బజారుకు తీసుకొచ్చారు. కొండెపి నియోజకవర్గంలో పార్టీకి వచ్చే మెజారిటీ ఒంగోలు పార్లమెంట్ కు ఉపయోగపడుతుందని అనుకున్నాను. కానీ మీరు అనైక్యతతో ఏమి చేస్తున్నారు. మీకు తెలుసా..?” అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొండేపి నియోజకవర్గ టిడిపి నాయకులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా దామచర్ల సత్య సమాధానమిస్తూ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గాల్లో కల్లా కొండేపి నియోజకవర్గంలో అందరం ఐక్యంగా కృషి చేసి మీరనుకున్న మెజార్టీకి తగ్గకుండా కొండేపి సీటును గెలిపిస్తామని హామీ ఇచ్చారు.