Home ఆంధ్రప్రదేశ్ ఒంగోలు నగరపాలక సంస్థ అభివృద్ధిపై పాట ఆవిష్కరణ

ఒంగోలు నగరపాలక సంస్థ అభివృద్ధిపై పాట ఆవిష్కరణ

382
0

ఒంగోలు : “రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ నగరం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన స్వచ్ఛ ఒంగోలును తీర్చిదిద్దారు. గడిచిన రెండు సంవత్సరాలలో ఒంగోలు పురపాలక సంఘం చేపట్టిన అభివృద్ధి పై రూపొందించిన గేయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.” ఒంగోలు పట్టణంలోని డిఆర్డీఏ మహిళా సమాఖ్య భవనంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఒంగోలు నగర అభివృద్ధి తోపాటు నగర చారిత్రక నేపథ్యం వివరిస్తూ రచించిన గేయం పట్టణ ప్రజలను పులకింజేసింది. కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు, ఎంఎల్సి మాగుంట శ్రీనివాసరెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షులు, ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్, కలెక్టర్ వి వినాయచంద్, ఎస్సి కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ పాల్గొన్నారు.