హైదరాబాద్ : కేసీఆర్ ముందస్తు శంఖం పురించారు. ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆవెంటనే 105మందితో తొలి అభ్యర్థుల జాబితా కూడా ప్రకటించారు. తెలంగాణ ఆవిర్భవించాక ఏర్పడ్డ తొలి శాసనసభను ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు సంవత్సరాల మూడు నెలల నాలుగు రోజులు రద్దు చేశారు. కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ తన రాజీనామాను ఆమోదించన వెంటనే మీడియాతో మాట్లాడిన కేసీఆర్ సంచలన నిర్ణయాలను ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇద్దరికి టికెట్ నిరాకరించారు. నల్లాల ఓదేలు( చెన్నూరు), బాబూమోహన్(ఆందోల్) పేర్లు జాబితానుంది తొలగించారు.
ఇద్దరికి మినహా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. అభ్యర్థులందరితో ప్రచారం ప్రారంభిస్తున్నామని చెప్పారు.
కేసీఆర్ అభ్యర్థుల జాబితాలో కొందరు:
భద్రాచాలం-వెంకట్రావు
పినపాక-వెంకటేశ్వర్లు
అశ్వరావుపేట-తాటి వెంకటేశ్వర్లు
ఇల్లందు-కనకయ్య
కొత్తగూడెం-జలగం వెంకట్రావు
ఖమ్మం-పువ్వాడ అజేయ్ కుమార్
పాలేరు-తుమ్మల నాగేశ్వరరావు
వైరా-బానోతు మదన్‌లాల్
మధిర-లింగాల కమలరాజ్
సత్తుపల్లి-పిడమర్తి రవి
మహబూబాబాద్-బానోత్ శంకర్‌నాయక్
డోర్నకల్-డీఎస్.రెడ్యానాయక్
పరకాల-చల్లా ధర్మారెడ్డి
నర్సంపేట-పెద్ది సుదర్శన్‌రెడ్డి
వర్థన్నపేట-ఆరూరి రమేశ్
వరంగల్ వెస్ట్-వినయ్ భాస్కర్
భూపాలపల్ల-మధుసూధనాచారి
ములుగు-అజ్మీరా చాందూలాల్
జనగాం-ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
స్టేషన్‌ఘన్‌పూర్-డాక్టర్. తాటికొండ రాజయ్య
పాలకుర్తి-ఎర్రబెల్లి దయాకర్‌రావు
నల్గొండ-కంచెర్ల భూపాల్‌రెడ్డి
మిర్యాలగూడ-ఎన్.భాస్కర్
నాగార్జునసాగర్-నోముల నర్సింహయ్య
దేవరకొండ-రమావత్ రవింద్రకుమార్
మునుగోడు-కాసు కుంటల ప్రభాకర్‌రెడ్డి
నకిరేకల్-వేముల వీరేశం
సూర్యాపేట-జగదీశ్‌రెడ్డి
తుంగతుర్తి-గ్యేదర్ కిషోర్‌కుమార్
ఆలేరు-గొంగెడి సునీత
భువనగిరి-శంకర్‌రెడ్డి
నిజామాబాద్ అర్బన్-బి.గణేష్
నిజామాబాద్ రూరల్-బాజిరెడ్డి గోవర్థన్
ఆర్మూర్-జీవన్‌రెడ్డి
బాల్కొండ-వేముల ప్రశాంత్ రెడ్డి
బోధన్-షకీల్ అహ్మద్
బాన్సువాడ-పోచారం శ్రీనివాస్‌రెడ్డి
కామారెడ్డి-గంపా గోవర్ధన్
జుక్కల్-హన్మంతు షిండే
ఎల్లారెడ్డి-ఏనుగు రవీందర్‌రెడ్డి