https://youtu.be/T4CcyOmxzWI
చీరాల : ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టేవరికి ముందు గుర్తొచ్చే పేరు వాడరేవు శ్రీశ్రీశ్రీ రామానందసరస్వతి వారు. అనారోగ్యంతో బాధపడే వారికీ ఆయన పేరు వింటే తెలియని ఉత్సాహం, నమ్మకం, బరోసా… గ్రామ ఉమ్మడి అవసరాలకూ వాడరేవు స్వామివారిని కలిస్తే తీరుతాయన్న బరోసా… ఆలయాల జీర్ణోధ్దరణ, దైవసేవ చేయడంలో ఆయన ముందుంటారు. మానవ సేవే మాధవ సేవగా భావించే ఆయన ఆసరాకోసం వెళ్లే వారికి తనదైన పద్దతిలో సహాయపడటం ఆయన తత్వం. ఎవ్వరైనా తన ఆదరణ కోసం వెళ్లితే కాదనే పరిస్థితి లేదు.
శ్రీశ్రీశ్రీ రామానంద సర్వసతి ఆశీస్సులతో రూపుదిద్దుకున్న ఆలయాలు, నిర్మాణం జరిగిన కళ్యాణ మండపాలు, కమ్యునిటీ హాలులు ప్రజల అవసరాలకు వేదికలయ్యాయి. స్వచ్ఛ భారత్ ప్రభుత్వం ఇప్పుడు నినాదంగా తీసుకున్నప్పటికీ 15ఏళ్ల క్రితం పారిశుద్యం బాగుంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుందన్న ముందు చూపు ఆయనది. అందుకే మున్సిపాలిటీలు, మేజర్ పంచాయితీల్లో పారిశుద్య నిర్వహణకు అవసరమైన వాహనాలను సమకూర్చారు. బాటసారులు, ప్రజలు సేద తీరేందుకు అనువుగా ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయితీ రచ్చబండల వద్ద సిమెంటు బల్లలు సమకూర్చారు. ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు వాటర్ ప్లాంట్లు, వాటర్‌బబుల్స్ బహుకరించారు.
మహిళలను స్వయం ఆర్ధిక అభివృద్ది చేసేందుకు టైలరింగ్‌లో ఉచితంగా శిక్షణ ఇప్పించి జీవనానికి అనువుగా ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్నారు. ఇది ప్రతిఏటా ఎంపిక చేసిన పేద మహిళలకు నిరంతరం కొనసాగిస్తున్నారు.
అనారోగ్యంతో బాధపడే వారికి ఆర్ధిక సహాయం, వైద్య సహాయం చేయడంతోపాటు షుగరు వ్యాధితో బాధపడుతున్నవారికి రెండేళ్లుగా ప్రతినెలా క్రమం తప్పకుండా వైద్యశిభిరాలు నిర్వహిస్తూ వారికి అవసరమైన పూర్తి మందులను ఉచితంగా అందజేస్తున్నారు. ప్రతినెలా 1500మందికిపైగా వైద్యపరీక్షలు చేసుకుని మళ్లీ క్యాంపు వరకు అవసరమైన మందులను ఉచితంగా స్వామివారి ఆశీస్సులతో పొందుతున్నారు. ఇలా చీరాల పరిసర ప్రాంతంలో సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో నేనున్నాన్న బోరోసా ఇస్తున్న ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు