హైదరాబాద్: ఆరోగ్య సూత్రాలు విస్తృతంగా ప్రచారం పొందుతున్న నేపధ్యంలో మసాజ్ కేంద్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలసిసొలసిన శరీరానికి మూలికల తైలంతో మర్దన చేస్తాం. ఉత్తేజాన్ని కల్పిస్తామంటూ ప్రచారం చేస్తున్న కొన్ని మసాజ్ కేంద్రాల్లో మసాజ్ పేరుతో అనైతిక కార్యకలాపాలు చేస్తున్నారు. అందమైన యువతులతో మర్దన చేయిస్తామని పురుషులను ఆకర్షిస్తున్నారు. స్పా, మసాజ్ కేంద్రాల్లో పనిచేసేందుకు ఆసక్తి కలిగినవాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలు ఇస్తున్నారు. సౌందర్య పోషక శిక్షకుల ఉద్యోగాల పేరుతో యువతులను మాయ చేస్తున్నారు.
వృత్తిలో భాగంగా పురుషులకు మర్దన చేసే సమయంలో రహస్యంగా ఆ దృశ్యాలను చిత్రీకరిస్తారు. ఆ తర్వాత వాటిని చూపి వ్యభిచారానికి ఒప్పుకోవాలని బెదిరిస్తాడు. ఒప్పుకోకపోతే ఈ ఫొటోలు, వీడియోలు బంధువులు, సన్నిహితులకు పంపుతామని లొంగదీసుకుంటారు. ఒప్పుకొన్న వాళ్లకు జీతంతో పాటు అదనంగా నగదు ఇస్తారు. స్పా, మసాజ్ సెంటర్ల నిర్వాహకుల వద్ద తమ వ్యక్తిగత రహస్యాలు ఉండడంతో బాధితులు కుక్కిరుమనకుండా ఉంటున్నారు. ఈ అనైతిక పనుల్లో మసాజ్ కేంద్రాల యజమానులతో పాటు కొందరు మహిళలూ కీలక పాత్ర వహిస్తున్నారు. నిర్వహణలో మహిళలు ఉండడంతో పోలీసులకు అనుమానించడం లేదు. కొన్ని చోట్ల అసాంఘిక కార్యకలాపాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. కేంద్రాల నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఉత్తర, మధ్య మండలాల్లోని మసాజ్ కేంద్రాలపై పోలీసులు దృష్టి కేంద్రీకరిస్తే అనైతిక కార్యకలాపాలకు అడ్డుకట్ట పదుతుంది.
గురుపుత్ర ఎస్టేట్లో స్ల్పాష్ బ్యూటీ సెలూన్….
నారాయణగూడ గురుపుత్ర ఎస్టేట్లో స్ల్పాష్ బ్యూటీసెలూన్‌ను రాధారెడ్డి అనే మహిళ సౌందర్య పోషక, మర్దన కేంద్రాన్ని గత నాలుగేళ్లుగా నడుపుతొంది. అయితే వ్యభిచారం నిర్వహిస్తోందంటూ సమాచారం అందడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెయిల్‌పై విడుదలైనప్పటికి మళ్లీ అనైతిక పనులకు తెరతీసింది. ఇలా గడిచిన రెండేళ్లలో ఆమెను మూడుసార్లు అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లారు. ఆమె అల్లుడు, వైజాగ్‌కు చెందిన గరిక సంతోష్ ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చి తాను మర్దన చేస్తానంటూ మేనేజర్ బాధ్యతలు తీసుకున్నాడు. అప్పటి నుండి ఎర్ర శ్రీకాంత్ సహయంతో తమ స్పాలో క్రాస్‌మసాజ్ ఉంటుందని ప్రచారం చేశారు. మసాజ్ చేసేందుకు ముగ్గురు యువతులను చేర్చుకున్నారు. మర్దనతో పాటు వాళ్లతో వ్యభిచారం మొదలుపెట్టాడు. ఈ బ్యూటీసెలూన్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. జూన్ 17న కేంద్రంలో సోదాలు చేశారు. గరిక సంతోష్, ఎర్ర శ్రీకాంత్‌లతో పాటు యువతులను పోలీసులకు అప్పగించారు.
జూబ్లీహిల్స్ లో శ్రీ వీనస్ యూనిసెక్స్…
జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబరు 10లో శ్రీవీనస్ యూనిసెక్స్ సెలూన్ పేరుతో నడుపుతున్న స్పా పై పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. స్పాలో ముగ్గురు యువకులకు యువతులతో మసాజ్ చేస్తున్నారు. అనంతరం వారి గదుల్లో సోదాలు నిర్వహించారు. పదుల సంఖ్యలో కండోమ్‌లు దొరికాయి. గట్టు మల్లి స్పా యజమాని జి శంకర్‌ను ప్రశ్నించారు…తాను, పుప్పాలగూడకు చెదిన ఎం బిందు కలిసి స్పాను నడుపుతున్నామని చెప్పారు. వినియోగదారులకు మసాజ్తో పాటు అక్రమ పనులకోసం యువతులను పంపిస్తున్నామని ఒప్పుకున్నారు.
రెండు గదుల్లో వ్యభిచారం నదుపుతున్నట్లు అంగీకరించాడు. శంకర్, బిందుల వద్ద నుంచి మూడు ఫోన్లు, రూ.1200 నగదు స్వాధీనం చేసుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.