Home సినిమా అప్ప‌డాలు అమ్మి…

అప్ప‌డాలు అమ్మి…

333
0

జైపూర్‌ : ఆయ‌నో స్టార్ హీరో. ఆయ‌న పేరు వింటే హిందీ ప్రేక్ష‌కులు మురిసిపోతారు. అలాంటి న‌టుడు ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా? మ‌హాన‌గ‌రాల్లోని బస్టాప్‌ల్లో, కూడళ్లలో అప్పడాలు, పిండివంటలు అమ్ముకుంటూ చాలామందికి కనిపిస్తారు. ఆయ‌న‌ను చాలామంది పట్టించుకోరు. అవసరముంటే వారి వద్దకు వెళ్లి కొంటారు. అయితే ఈ అప్ప‌డాలు అమ్ముతున్న హీరో ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఎవరూ గుర్తుపట్టలేనంతగా ఆయ‌న మారిపోరారు. త‌న‌ పాత్రలో ఒదిగిపోయి న‌టించారు. ఫొటోలు చూసి నెటిజన్లు విస్మయపోతున్నారు.

ఇంతకు ఆ వ్యక్తి ఎవరో తెలుసా…..? ఆయ‌నే బాలీవుడ్‌ గ్రీకుదేవుడు హృతిక్‌ రోషన్‌. ఆయన తాజాగా సూప‌ర్‌30 సినిమాలో నటిస్తున్నారు. సినిమా ‘సూపర్‌ 30’.. బిహార్‌కు చెందిన ప్రముఖ గణిత ఉపాధ్యాయుడు ఆనంద్‌కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా వికాస్‌ బల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా హృతిక్‌ ఇలా ఎవరూ గుర్తుపట్టనంతగా మారిపోయి.. జైపూర్‌లోని కూడళ్లలో సైకిల్‌ మీద అప్పడాల బుట్ట పెట్టుకొని.. వీధి, వీధి తిరిగి అమ్మాడు. సైకిల్‌ మీద అప్పడాలు అమ్ముతూ అతను వీధుల్లో తిరిగినా ఎవరూ గుర్తుపట్టలేదు. తాజాగా సోషల్ మీడియాలో లీకైన ఈ ఫొటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. పాత్రలోకి సంపూర్ణంగా లీనమై నటించడంలో ఆయ‌న‌కు ఆమ‌నే సాటి అంటూ అభిమానులు కొనియాడారు.