Home వైద్యం కామాక్షి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

కామాక్షి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

534
0

చీరాల : వాసవి, కన్యక పరమేశ్వరి అమ్మవారి కళ్యాణ మండపంలో శ్రీకామాక్షి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత వైద్య శించిరం నిర్వహించారు. శిబిరంలో ఎముకల డాక్టర్ చలువాది వెంకటేష్ మాట్లాడుతూ కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు మెట్లు ఎక్కడం, ఎక్కువసేపు నడవడం వంటి పనులు చేయకూడదని చెప్పారు. చెవి, ముక్కు, గొంతు డాక్టర్ పలుకురి సురేష్ మాట్లాడుతూ చెవిలోకి నీళ్లు వెళ్లకుండా చూసుకోవాలని చెప్పారు.

జనరల్ సర్జన్ డాక్టర్ గవిని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భోజనానికి ముందు చేతులు పరిశుభ్రం చేసుకోవాలన్నారు. లేకుంటే అరుగుదల సమస్యలు వస్తాయన్నారు. హాస్పిటల్ మేనేజర్ తాడివలస సురేష్ మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి తమ వైద్యశాలలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పారు.