బాపట్ల : సబ్ డివిజన్ పరిధిలోని వివిధ నేరాలకు సంబంధించిన కేసుల పరిశోదనలో పురోగతిపై డిఎస్‌పి గంగాధరం శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సబ్ డివిజన్‌లోని వివిధ స్టేషన్ల సిఐలు, ఎస్ఐలతో జరిగిన సమావేశంలో స్టేషన్ల వారీగా నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా కేసుల్లో ముద్దాయిలను పట్టుకోవడంలో ఇప్పటి వరకు జరిగిన పనిని సమీక్షించారు. కేసులు సత్వరం పరిష్కరించి ముద్దాయిలను పట్టుకునేందుకు మరింత సృజనాత్మకంగా పనిచేయాలని సూచించారు. నేరస్తులను పట్టుకోవడంలో ఆధునిక సాంకేతిక పద్దతులను ఉపయోగించుకోవాలని చెప్పారు.