చీరాల : కేంద్ర ప్రభుత్వం ఎస్సి, ఎస్టీ యాక్టును సవరిస్తూ పార్లమెంటులో చర్చకు పెట్టింది. ముద్దాయి ల అరెస్టు విషయంలో సడలింపు ఇచ్చారు. దీనికి నిరసనగా దళిత, గిరిజన సంఘాల ఐక్యవేదిక వరంగల్ లో దళిత, గిరిజన సింహ గర్జన సభ ఆదివారం నిర్వహించారు. సభకు చీరాల నుండి దళిత, గిరిజన సంఘాల నేతలు గోసాల ఆశీర్వాదం, ఎన్ మోహనకుమార్ ధర్మ, బి లక్ష్మీనరసయ్య, పులిపాటి రాజు, కౌన్సిలర్ పొదిలి ఐస్వామి పాల్గొన్నారు.