చీరాల : ఆన్ లైన్లో మెడికల్స్ విక్రయాల అనుమతికి నిరసనగా దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ కు కెమిస్ట్స్ అండ్ డ్రాగ్గిస్ట్స్ అసోసియేషన్ ప్రకటించింది. అసోసియేషన్ పిలుపు మేరకు చీరాలలో మెడికల్ షాపుల యజమానులు శుక్రవారం షాపులు బంద్ చేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
గడియారస్తంభం సెంటర్లో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చెంచయ్య, ప్రసాద్ మాట్లాడారు. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజల ఆరోగ్యానికి మూపురానుందని చెప్పారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి విదేశీ ఆన్లైన్ కంపినీలు లాభపడటమే కాకుండా అత్యవసర సమయంలో మందులు అందుబాటులో లేక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. మెడికల్ షాపుల యజమానుల ఆందోళనకు ప్రజలు సహకరించాలని కోరారు. రాస్తారోకో అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.