Home సినిమా కేసు పెట్ట‌డం త‌ప్ప మ‌రోప‌నిలేదా? ప్రియా ప్రకాశ్‌పై కేసు కొట్టిసిన న్యాయ‌స్థానం

కేసు పెట్ట‌డం త‌ప్ప మ‌రోప‌నిలేదా? ప్రియా ప్రకాశ్‌పై కేసు కొట్టిసిన న్యాయ‌స్థానం

856
0

హైదరాబాద్ : ఎవ‌రో సినిమాలో ఏదో పాట‌పాడితే దానిపై మీకు కేసు వేయ‌డం త‌ప్ప మ‌రో ప‌నేమీలేదా? అంటూ సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి దీప‌క్ మిశ్రా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మలయాళ నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్ ఒరు ఆధార్ ల‌వ్ చిత్రంలో క‌న్నుకొట్టిన స‌న్నివేశం ముస్లిం మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేదిగా ఉంద‌ని తెలంగాణాకు చెందిన కొంద‌రు కోర్టులో వేసిన పిటీష‌న్‌ను విచారించారు. ఈ కేసులో ప్రియాప్ర‌కాష్ వారియార్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కేసు దాదాపు నాలుగు నెలల పాటు విచారించారు. ఈ కేసు నేటితో ఓ కొలిక్కి వచ్చింది. ప్రియప్ర‌కాష్‌పై వేసిన కేసును కొట్టివేస్తూ శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది.

‘ఒరు అదార్ లవ్’ చిత్రం ‘మాణిక్య మలరయ’ పాటలో ప్రియ ప్ర‌కాష్‌ కన్ను కొట్టిన సన్నివేశాలు దేశవ్యాప్తంగా వైరలైన‌ సంగతి తెలిసిందే. ఈ పాట కేరళ ముస్లిం సంప్రదాయపు గీతం అని, ప్రియ కన్నుకొట్టడం అసభ్యకరంగా ఉందంటూ కొంద‌రు ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఒమర్‌ లులు ఈ చిత్రానికి దర్శకత్వం వహించ‌గా అబ్దుల్‌ రహూఫ్‌ కథానాయకుడిగా నటించారు. సుప్రీంకోర్టు తీర్పుతో చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.