బాపట్ల : బిగ్ బాస్2 విజేతగా నిలిచిన కౌశిల్ బాపట్ల శృంగారపురంకి చెందిన రిటైర్డ్ జుడీషీయల్ ఉద్యోగి చింతల గోపీచంద్ ద్వితీయ కుమార్తె నీలిమ భర్త కౌషల్. వీరిద్దరికీ బాపట్లలోనే 2011లో వివాహమైంది. హైదరాబాద్ లో ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ నిర్వహిస్తున్నారు. కౌషల్ బాలనటుడుగా సినిమా, టెలివిజన్ సీరియల్స్ లో నటిస్తున్నారు. గత కొంత కాలంగా ప్రముఖ ఛానల్స్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ లో, పలు సినిమాల్లో నటిస్తున్నారు. బహుళ ప్రజాదరణతో వంద రోజుల పైగా నడిచిన బిగ్ బాస్ 2 విజేత కౌషల్ గెలవడంపట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.