Home ప్రకాశం జనసేన కార్యకర్తల రాస్తారోకో

జనసేన కార్యకర్తల రాస్తారోకో

416
0

చీరాల : జనసేన పార్టీకార్యకర్తలపై దాడులకు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై చింతమనేని ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జనసేన కార్యకర్తలు ధర్నా చేశారు. ధర్నాలో జనసేన నాయకులు గూడూరు శివరామప్రసాద్ మాట్లాడారు. చింతమనే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జనసేన కార్యకరలపై దాడిచేసిన గూండాలను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. ‘చింతమనేని దౌర్జన్యాలకు ఇకనైనా చరమ గీతం పాడాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ధర్నా చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు గూడూరు శివరామ ప్రసాద్, తోట రాజశేఖర్, ఎరిచర్ల అశోక్ కుమార్, తేజ, ఖాజా శ్రీనివాసరావు, అనుభవం మణి, కిరణ్, చింటూ పాల్గొన్నారు.