– సైన్స్‌ను వినాశనానికి ప్రయోగించిన అమెరికా
– హిరోషిమా, నాగసాకి పట్టణాలను బూడిద చేసిన అమెరికా
– సైన్స్‌ను మానవాభివృద్దికి కాకుండా వినాశనానికి వాడితే దుష్పరిణామాలు
సైన్స్ డెస్క్ : ఏదైనా చూసే కళ్లను బట్టి, చేసే ఆలోచనలను బట్టే మనిషి ప్రవర్తన ఉంటుందన్నట్లే మానవాళి మనుగడ, అభివృద్దికి ఆవిష్కరిస్తున్న సైన్స్, శాస్ర్తసాంకేతిక పరిజ్ఞానం సక్రమమైన పద్దతిలో కాకుండా దుర్వినియోగం చేసినా, ఆగ్రహానికిలోనై సైన్స్‌ను వినాశనానికి ప్రయోగిస్తే ఎలా ఉంటుంది. అంటే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం హిరోషిమ, నాగసాకి పట్టణాలే. ప్రపంచ మానవాళి చరిత్రలో మొట్టమొదటిసారి అణుబాంబు ప్రయోగం చేసింది అమెరికా. రెండో ప్రపంచ యుద్ద సమయంలో ఆగష్టు 6న హిరోషిమ, ఆగష్టు 8న నాగసాకి పట్టణాలపై అమెరికా అణుబాంబులు వేసింది. రెండు పట్టణాలను శవాల దిబ్బను చేసింది. అంతే కాదు నూరేళ్లపాటు మొక్కమొలవకుండా చేసింది. అంతటి శక్తివంతమైన అణుబాంబులను భూమిపై మొట్టమొదట ప్రయోగించి నేరం చేసిన అమెరికా ఇప్పుడు ప్రపంచ పోలీసు పాత్ర పోషిస్తుంది. ప్రపంచంలో మరెవ్వరూ అణుప్రయోగాలు కూడా చేయడానికి వీలులేదని బెదిరింపులకు దిగుతుంది.
కిమ్‌జాంగ్ ఇటీవల కాలంలో ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది. ఉత్తరకొరియా అణుపరీక్షలతో ప్రపంచ ఒక్కసారి ఒణికాంది. ప్రయోగాలు చేస్తే సహించేదిలేందంటూ అమెరికా చేసిన హెచ్చరికలకు ప్రతిగా కొరియా అధ్యక్షుడు కిమ్ ప్రతిస్పిందించారు. అమెరికా వద్ద ఉన్న అణుబాంబులన్నీ ప్రయోగిస్తే మహావిశ్వంలో భూమి కనిపించకుండా మటుమాయం అవుతుంది. అంతటి శక్తివంతమైన బాంబులు తయారు చేసిపెట్టుకున్న అమెరికా ఏం సాధించాలని ప్రపంచ దేశాలను బెదిరిస్తుంది.
అదే అణు శక్తిని మానవాళి అవసరాలకు వినియోగిస్తే… అదే మానవాళి అవసరాలకు వినియోగిస్తే ప్రపంచ మొత్తం రాత్రీపగలు తెలియనంత వెలుగు ఇవ్వవచ్చు. విద్యుత్ కొరత లేకుండా నిర్వరామంగా విద్యుత్‌పై ఆధారపడ్డ పరిశ్రమలు నడపవచ్చు. అలాంటి శక్తివంతమైన శాస్ర్త సాంకేతిక పరిజ్ఞానాన్ని మానవాళి అవసరాలకు సద్వినియోగం చేసుకునేలా చూడాలి.
అణుపదార్ధాలు – ప్రయోజనాలు అంశంపై సైన్స్ ఉపాధ్యాయులు పవని భానుచంద్రమూర్తి ఇచ్చిన వివరణలు ఒక్కసారి వినండి. ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో మీకే తెలుస్తుంది.
రచన : పవని భానుచంద్రమూర్తి, సైన్స్ ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్, చీరాల