Home ఆంధ్రప్రదేశ్ ఐక్య‌రాజ్య స‌మితిలో భార‌త శాశ్వ‌త ప్ర‌తినిధి స‌య్య‌ద్ అక్బ‌రుద్దీన్‌తో ఎపి సిఎం చంద్ర‌బాబు

ఐక్య‌రాజ్య స‌మితిలో భార‌త శాశ్వ‌త ప్ర‌తినిధి స‌య్య‌ద్ అక్బ‌రుద్దీన్‌తో ఎపి సిఎం చంద్ర‌బాబు

430
0

ఇంట‌ర్‌నెట్ : ఎపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప్ర‌స్తుతం అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. అమెరికాలో ఉన్న‌ ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్‌ను చంద్ర‌బాబు సోమ‌వారం మర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. వీరిద్ద‌రి స‌మావేశంలో ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబు ఆలోచన విధానాన్ని అక్బరుద్దీన్ అభినందించారు. ముఖ్యమంత్రి బృందంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిశోర్, సమాచార శాఖ కమిషనర్ వెంకటేశ్వర్ ఉన్నారు.