Home ఆంధ్రప్రదేశ్ ఏపీలోనూ వేడెక్కిస్తున్న సర్వేలు… బాబు వర్సెస్ జగన్, మోడీ వర్సెస్ రాహుల్ చుట్టూ తిరిగిన సర్వేలు…

ఏపీలోనూ వేడెక్కిస్తున్న సర్వేలు… బాబు వర్సెస్ జగన్, మోడీ వర్సెస్ రాహుల్ చుట్టూ తిరిగిన సర్వేలు…

503
0

అమరావతి : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందనే సామెత వినే ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో నేతల పరిస్థితి ఇలాగే ఉంది. తెలంగాణలో కేసీఆర్ ముందుగానే ఎన్నికల నగారా మోగించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తోపాటు ఆంధ్రలోను ఎన్నికల వేడి మొదలయింది. సాధారణంగా ఆంధ్రాలో 2019మే నెల వరకు ప్రభుత్వానికి గడువు ఉన్నప్పటికీ జనవారిలోనే ఎన్నికలొస్తాయనే ప్రచారం జరుగుతోంది.

ఎన్నికల వాతావరణంతో తెలుగు రాష్ట్రాల్లో ఏ నేత భవిష్యత్తు ఎలా ఉంటుందో, ప్రజల్లో ఎవరికి ఎంత పలుకుబడి ఉందన్న అంశంపై సర్వేల హడావుడి జనంలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కించింది. ఒక సర్వేలో వెల్లడైన సంగతులు సంచలనం కలిగించాయి. ఆజ్‌త‌క్‌లో ప్రసార‌మైన సర్వే ఫలితాలు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. వీరి సర్వేలో జగన్ అనూహ్యంగా టాప్ లీడర్ అయ్యారు. ఏపీలో సీన్ రివ‌ర్స్ అయ్యి చంద్ర‌బాబు పాపులారిటీ పడిపోయినట్లు చూపారు. విపక్ష నేత జ‌గ‌న్కు పాపులారిటీ పెరిగిపోయింది. సర్వేలో మీ లీడ‌ర్ ఎవ‌రు అని అడిగిన ప్ర‌శ్న‌కు 43 శాతం మంది జ‌గ‌న్ పేరు చెప్పగా కేవ‌లం 38 శాతం మంది మాత్ర‌మే చంద్ర‌బాబు పేరు చెప్పారట. 5 శాతం మంది ప‌వ‌న్ పేరు చెప్పారు.

చంద్ర‌బాబు ప‌నితీరు ఎలా ఉందన్న ప్రశ్నకు 33 శాతం మంది బాగుంది అంటే…18 శాతం మంది ప‌ర్వాలేదు అని.. 38 శాతం మంది బాగాలేద‌ని చెప్పారు. బాబు పరిస్థితి ఇలావుంటే ఏపీలో మోడీకీ దిమ్మ తిరిగే అభిమానం చూపారట. మోడీకి 38శాతం జై కొడితే రాహుల్‌కి 44 శాతం మంది జై కొట్టారని సర్వే వివరాలు ప్రకటించింది. ఇలా ఈ స‌ర్వే ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌ మారింది.

ఇక తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ ఫుల్ మార్క్స్ కొట్టేశారు. ఉత్త‌మ్ కుమార్రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. తెలంగాణ‌లో బెస్ట్ లీడ‌ర్ ఎవ‌రు అనే ప్రశ్నకు సీఎం కేసీఆర్ 43 శాతం మంది మద్దతు పొందగా, ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డికి 18 శాతం మంది, కిష‌న్‌కుమార్ రెడ్డికి 15 శాతం మంది మద్దతు ప్రకటించారు.

అంతే కాదు… ప్ర‌భుత్వ ప‌నితీరులో టీఆరెస్ ప్రభుత్వంకు అత్య‌ధిక మార్కులే ప‌డ్డాయి. కేసీఆర్ స‌ర్కార్‌కు బాగుంద‌ని 48 శాతం మంది అంటే..16 శాతం మంది ప‌ర్వాలేదు అనగా 25 శాతం మంది బాగా లేద‌న్నారు. ఇక తెలంగాణలో రాహుల్ గాంధీ కంటే మోదీకె ఎక్కువ‌ మంది జై అంటున్నారు. 44 శాతం మంది మోదీకి జై కొడితే 39 శాతం మంది రాహుల్‌ నాయకత్వం కోరుకున్నారట. ఓట్లపెట్టెలో జనం ఎలాంటి తీర్పు ఇస్తారో కానీ సర్వేలు మాత్రం బుర్రలు తొలిచేస్తున్నాయి.