Home ప్రకాశం బాబ్లీ కేసులో చంద్రబాబుపై కేంద్రం తీరుకు డోలా నిరసన

బాబ్లీ కేసులో చంద్రబాబుపై కేంద్రం తీరుకు డోలా నిరసన

292
0

కొండపి : తెలుగు రాష్ట్రాల ప్రయోజనం కోసం ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర ప్రభుత్వంపై ఆందోళన చేశారు. అప్పటి కేంద్రప్రభుత్వం కేసు నమోదుచేశి సమస్య పరిష్కారం చేయకుండా జైలుకు పంపింది. చంద్రబాబు తోపాటు 15మంది ఎమ్మెల్యేలను జైలుకు పంపి రాజకీయం చేసింది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ప్రయోజనం కోసం కోర్టులను ప్రభావితం చేసి అరెస్టు వారెంట్లు వచ్చేలా చేశాయని కొండపీ ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయులు ఆరోపించారు. నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ రామయ్య చౌదరి, ఎంపీపీ దేపూరి రతమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు యలమంద నాయుడు, బిసి సెల్ నాయకులు నారాయణ స్వామి, అనకర్లపూడి ఎంపీటీసీ వసంత్ రావు, కమేపల్లి సర్పంచ్ రాంబాబు పాల్గొన్నారు.