కారంచేడు : స్వర్ణ గ్రామంలో సుంకర పద్మావతి అనే మహిళను ఆమె సోదరుడు కత్తితో పట్టపగలు నరికి చంపిన ఘటన మంగళవారం సంచలనం రేపింది. కుటుంబ కలహాలతో అక్కను తమ్ముడు నరికి చంపాడు.
మృతురాలికి ఇటీవలే వివాహం జరిగింది. అయితే మృతురాలి చిన్నాన్న కొడుకు అయిన సింగయ్యకు ఆమెకు గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామంలోని శివాలయం రోడ్డులో వెళుతున్న పద్మావతిని వెంబడించి సింగయ్య కత్తితో నరికి చంపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.