పొన్నలూరు : లింగంగుంట గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త ఎనిమిరెడ్డి పెద్ద బ్రహ్మారెడ్డి మృతికి కారణమైన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైసిపి కొండెపి నాయకులు వరికూటి అశోక్ బాబు కందుకూరు డిఎస్పీని కోరారు.
ఇటీవల టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడి న గ్రామ వైఎస్సార్ సీపీ కార్యకర్త ఎనిమిరెడ్డి పెద బ్రహ్మరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న అశోక్ బాబు మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన కందుకూరు డిఎస్పీతో అశోక్ బాబు మాట్లాడారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మృతునికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.