Home సినిమా మరోసారి నితిన్‌తో రొమాన్స్ చేయబోతున్న స్టార్ హీరోయిన్.. వైరల్ అవుతున్న పోస్ట్

మరోసారి నితిన్‌తో రొమాన్స్ చేయబోతున్న స్టార్ హీరోయిన్.. వైరల్ అవుతున్న పోస్ట్

132
0

వెబ్ డెస్క్ : నితిన్(Nithin) హీరోగా వేణు యెల్దండి(Venu Yeldandi) తెరకెక్కిస్తున్న మూవీ ‘ఎల్లమ్మ’(Yellamma).‘ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అజయ్ అతుల్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రూరల్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో నితిన్ మునుపెన్నడూ కనిపించని పాత్రలో కనిపించనున్నాడు. ఇక ‘బలగం’ (Balagam) వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు వేణు నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇందులో హీరోయిన్‌గా ఇన్ని రోజులు సాయిపల్లవి (Sai Pallavi) పేరు వినిపించగా, తాజాగా ఆమె ఈ మూవీ నుంచి తప్పుకొందనే కొత్త రూమర్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అలాగే ఆమె ప్లేస్‌లో మరో స్టార్ క్రేజీ హీరోయిన్ ఫిక్స్ అయినట్లు సమాచారం.

ఇంతకీ ఆమె ఎవరో కాదండోయ్ మహానటి కీర్తి సురేష్ (Keerthi Suresh). ఏంటి నిజమా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ‘ఎల్లమ్మ’ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివరి నాటికి స్టార్ట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి డేట్స్ క్లాష్ అవుతాయనే కారణంతో ఈ సినిమాకు నో చెప్పిందట. దీంతో డైరెక్టర్ వేణు కీర్తి సురేష్‌కు స్క్రిప్ట్ చెప్పారని, తన పాత్ర నచ్చడంతో కీర్తి ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పిందట.

కానీ, అఫీషియల్‌గా ఈ ప్రాజెక్టుకు అసలు కీర్తి సురేష్ సంతకం చేసిందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియ రాలేదు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. కాగా నితిన్, కీర్తి సురేష్ కలిసి ఇదివరకే ‘రంగ్‌ దే’(Rang De) మూవీలో నటించిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ (Sitara Entertainments) బ్యానర్‌లో సూర్యదేవర నాగ వంశీ (Suryadevara Naga Vamsi) నిర్మించిన ఈ సినిమాకి వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వం వహించాడు.