గుంటూరు : చెరుకుపల్లి మండలం కుంచలవారిపాలెం వద్ద నిజాంపట్నం ప్రధాన కాలువలో షుమారు 35 సంవత్సరాల వయసుగల వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. పొలాల్లోని రైతులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చెరుకుపల్లి ఎస్ఐ రాజేశ్వరరావు కాలువ నుండి మృతదేహాన్ని బయటికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.