Home ఆంధ్రప్రదేశ్ టిడిపితోనే రాష్ట్ర బంగారు భవిత సాధ్యం

టిడిపితోనే రాష్ట్ర బంగారు భవిత సాధ్యం

121
0

పెనమలూరు : రాష్ట్ర బంగారు భవిత టిడిపితోనే సాధ్యమని ఆ పార్టీ నియోజకవర్గ నాయకురాలు దేవినేని స్మిత అన్నారు. పెనమలూరు గ్రామం శ్రీహరి గార్డెన్స్, అజయ్ నగర్ కాలనిలో బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోను వివరించారు. మేనిఫెస్టో ప్రతులను పంపిణీ చేశారు. స్మిత మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ధమనకాండ కొనసాగిస్తుందని అన్నారు. సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి పరిపాలన సాగిస్తుందని విమర్శించారు. సైకో పాలనను తరిమికొట్టాలని కోరారు. టిడిపికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.