డిల్లీ: టిడిపికి చెందిన కేంద్ర మంత్రులు సుజనాచౌదరి, అశోక్‌గజపతిరాజు రాజీనామాలకు సిద్ధమయ్యారు. రాజీనామా లేఖలను సిద్ధం చేసుకున్నారు. ఇద్దరు మంత్రులు ప్రధాని నరేంద్రమోదీని అపాయింట్‌మెంట్ కోరారు. అయితే వీరిద్దరికీ ప్రధాని సాయంత్రం 4 గంటల తర్వాత అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానిని కలిసిన అనంతరం ఏమి జరుగుతుందనేది వేచి చూడాల్సింది.