చీరాల : వాడరేవు శ్రీశ్రీశ్రీ రామనంద సరస్వతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత షుగరు వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. శిబిరంలో గుంటూరు వైద్య కళాశాల విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రాజేశ్వరి వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగులకు నెలరోజులకు సరిపడు మందులను ఉచితంగా అందజేశారు.
1657మందికి పరీక్షలు జరిపి మందులు ఇచ్చారు. ఈ సందర్బంగా సంస్థ ప్రతినిధులు కృష్ణారావు మాట్లాడుతూ ప్రతి నెల నాలుగవ ఆదివారం ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్య శిభిరానికి హాజరైన వారందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఎన్ సురేష్, వైద్యులు రాజరాజేశ్వరి, లలిత్ ప్రకాష్, సుధాకర్ యాదవ్, ఎంజి శంకరరావు పాల్గొన్నారు.