ఈ అమ్మాయి ని చూశారా. ముఖంపై చెరగని చిరునవ్వుతో ఎంత అందంగా ఉందొ. అందానికే అర్ధం చెప్పేలా ఉన్న ఈ నిర్మలమైన ముఖారవిందాన్ని చూసారా? ప్రశాంతతను ముఖంపై పలికిస్తున్న ఈ యువతి గుండెలు పట్టలేని బాధను తనలోనే దాచుకుంది. ఆ బాధను భరించలేక చివరకు నిన్నటి తెల్లవారుజామున బలవంతంగా ఊపిరి తీసేసుకుంది. కాదు కాదు ఎందరినో తన రాక్షస హస్తాల్లో నలిపేస్తున్న బ్లూవెల్ భూతం ఈ అందాల భరినేను మింగేసింది.
శివగంగ జిల్లా మునియాండిపురానికి చెందిన భరణిదాస్ కుమార్తె తరణి(19) దిండుగల్‌లోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీఈ రెండో సంవత్సరం చదువుతోంది. మంగళవారం తెల్లవారుజామున తరణి తను వుండే హాస్టల్ భవనం మిద్దెపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రాణాంతక ‘బ్లూవేల్’ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
తరణి హాస్టల్‌లో ఉంటూ కళాశాలకు వెళ్తోంది. మంగళవారం వేకువజామున సహా విద్యార్థులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో తరణి హాస్టల్ భవనం మూడో అంతస్థుపై నుంచి కిందకు దూకింది. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.