చీరాల : సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులు సమర్పించిన ప్రాజెక్టులు ఇండియన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎంటెన్నాస్ అండ్ ప్రాపగేషన్ నిర్వహిస్తున్న స్టుడెంట్ ఇన్నోవేటివ్ ప్రాజెక్టు పోటీలకు ఎంపికైనట్లు కళాశాల కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఐఇఇఇ ఆధ్వర్యంలో డిసెంబర్ 16నుండి 19వరకు జరుగనున్న ఇండియన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎంటెన్నాస్ అండ్ ప్రాపగేషన్ పోటీలకు ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యునికేషన్స్ విభాగానికి చెందిన విద్యార్ధులు రూపొందించిన ప్రాజెక్టు ఫైనల్ రౌండ్‌కు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ తెలిపారు. ఇసిఇ విభాగం నాలుగో సంవత్సరం విద్యార్ధులు కె లీలా వెంకట సూర్యతేజ, జి వెంకటేష్, ఎ శేషసాయి రూపొందించిన ఆర్ఎఫ్ ఎనర్జి హార్‌వెస్టింగ్ ఫైనల్ రౌండ్‌కు ఎంపికైనట్లు ప్రాజెక్టు ప్రమోటర్, ఇఎస్ఇ హెచ్ఒడి డాక్టర్ కె జగదీష్‌బాబు తెలిపారు. ఆఖరి రౌండ్‌లో కూడా ఎంపికై బహుమతి సాధించాలని కోరారు.