Home ఆధ్యాత్మికం పెళ్లి పత్రిక పంపిస్తే.. శ్రీవారి తలంబ్రాలు

పెళ్లి పత్రిక పంపిస్తే.. శ్రీవారి తలంబ్రాలు

544
0

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం వినూత్న కార్యక్రమం చేపట్టింది. కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులకు శ్రీవారికి నిర్వహించే నిత్య కళ్యాణంలో వినియోగించే పవిత్ర తలంబ్రాలను అందజేయాలని నిర్ణయించింది. ఈమేరకు టీటీడీ పీఆర్‌వో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీవారి ఆశీర్వచనం కావాలనుకునే నూతన దంపతులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ పెళ్లి పత్రికను పోస్టు ద్వారా తమకు పంపిస్తే శ్రీవారి పవిత్ర తలంబ్రాలను వారికి పోస్టు ద్వారా ఉచితంగా అందజేస్తామని తెలిపారు. పెళ్లి పత్రికను ఎగ్జిక్యూటివ్ అధికారి, టీటీడీ, కేటీ రోడ్, తిరుపతి-517 501కు పంపించాలని పేర్కొన్నారు.