Home ఆంధ్రప్రదేశ్ బస్సులన్ని నారా వారి సభకు… జనమంతా ఆటోలకు…

బస్సులన్ని నారా వారి సభకు… జనమంతా ఆటోలకు…

518
0

గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరులో నారా హమారా – తెలుగుదేశం హమారా నినాదంతో భారీ సభను ఏర్పాటు చేశారు. సభ విజయవంతానికి జన సమీకరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులు టిడిపి కార్యకర్తలు సేవలో వెళ్లడంతో బస్టాండులన్ని బోసిపోయి కనిపిస్తున్నాయి.

నిత్యం ప్రయాణికులతో రద్దీగా కళకళలాడే బస్టాండులు, ఆర్టీసీ డిపోల జనం లేకుండా అప్రకటిత బంద్ వాతావరణం నెలకొంది. రోజువారీ ప్రయాణికులు ఎప్పటిలాగానే బస్సులు ఉంటాయనుకుని బస్టాండుకు వచ్చి బస్సులు లేవని తెలుసుకుని నిరాశతో వెనుదిరిగి వెళుతున్నారు. ప్రయాణం తప్పదనుకున్న వాళ్ళు మాత్రం ఆటోలను ఆశ్రయిస్తున్నారు.

అదునుగా తీసుకున్న ఆటోలు రోజుటికన్న అదనంగా వసూలు చేయడంతోపాటు ప్రయాణికుల వత్తిడితో పరిమితికి మించి ఎక్కిస్తున్నారు. పాఠశాల విద్యార్థులు సైతం బస్సులు లేకపోవడంతో బడి మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు నారా వారి హమారా సభ తమకు ఒక్కరోజు అనుకోని కష్టం తెచ్చిపెట్టిందన్ని ప్రయాణికులు వ్యాఖ్యానించారు.

ఆర్టీసీ ఆదాయానికి గండి పడింది. అసలే నష్టాల్లో ఉన్నదన్న ఆర్టిసిపై చంద్రబాబు సభల భారం ములిగేనక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకున్నప్పుడు అయ్యే ఖర్చు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పినప్పయికి సకాలంలో బడ్జెట్ రాక ఆర్టిసిపై భారం పడుతుందని ఆర్టీసీ అధికారులు, యూనియన్ల నాయకులు చెబుతున్నారు.