Home క్రైమ్ అర్ధ‌రాత్రి కారును ఢీ కొట్టిన ఆర్టీసీ బ‌స్‌

అర్ధ‌రాత్రి కారును ఢీ కొట్టిన ఆర్టీసీ బ‌స్‌

448
0

చీరాల : ముక్కోణం పార్కు సెంట‌ర్‌లో మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో చీరాల రైల్వేస్టేషన్ సమీపంలోని అంబేత్కర్ విగ్రహం వద్ద ఆర్టీసి బస్సు కారుని ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది. ప్ర‌మాదంలో కారు ముందు భాగం పూర్తిగాధ్వంసమైన‌ది. అయితే కారులో ప్రయాణిస్తున్న ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులు క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ప్ర‌మాద స్థలాన్ని యస్సై రాంబ్రహ్మం, పోలీసు సిబ్బంది ప‌రిశీలించారు. అర్ధ‌రాత్రి స‌మ‌యంలో రోడ్డు ఖాళీగా ఉంద‌నుకున్న ఆర్టీసీ డ్రైవ‌ర్ రాంగ్‌రూట్లో రావ‌డం వ‌ల్ల‌నే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు. ఒంగోలు వైపు నుండి వచ్చే వాహ‌నాలు ముంతావారి సెంటర్ నుండి ఫైర్ ఆఫీస్ మీదుగా బస్టాండ్ వైపుకు రావాల్సి ఉండ‌గా బాలికోన్న‌త పాఠ‌శాల వైపునుండి ఎంజిసి మార్కెట్ ఎదురుగా బ‌స్సు రావ‌డం, కారు గడియార స్తంభం వైపు నుండి ఫైర్ ఆఫీసు వైపు వెళ్తుంది కారు డ్రైవ‌ర్ దానిని గ‌మ‌నించ‌క‌పోవ‌డంతో ప్ర‌మాదం జ‌రిగింది. చిన్న‌గంజాంకు చెందిన బాధితుడు ఉమామ‌హేశ్వ‌ర‌రావు కొత్త‌పేట‌లో నివాసం ఉంటూ త‌న బంధువుల‌ను వైకుంఠ‌పురంలో దింపేందుకు వెళుతూ ప్ర‌మాదానికి గుర‌య్యాడు.