Home ఉపాధి విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ ఆధ్వ‌ర్యంలో ఆర్ఆర్‌బి ఉచిత అవగాహన సదస్సు

విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ ఆధ్వ‌ర్యంలో ఆర్ఆర్‌బి ఉచిత అవగాహన సదస్సు

551
0

” కలలు కనండి ఆ కలలను సాకారం చేసుకోండి“. – ఎపిజె అబ్దుల్ క‌లామ్‌
“బాబు వస్తే జాబు వస్తది అన్నది నిజము చేయండి“. – ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు

విజ‌య‌వాడ : విజయవాడ నగరపాలక కమిషనర్ సారథ్యంలో ఆర్ఆర్‌బి ఉచిత అవగాహన సదస్సు శ‌నివారం నిర్వ‌హించారు. కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ఆర్ఆర్‌బి ఉద్యోగాలకు విజయవాడలోని పోటీపరీక్షల ఉపాధ్యాయులు, నిపుణుల చేత రెండు నెలలపాటు ఉచిత‌ కోచింగ్ ఇవ్వ‌నున్నారు. కోచింగ్‌తోపాటు స్టడీ మెటీరియల్, భోజన సదుపాయాలను క‌ల్పిస్తున్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కోచింగ్‌ నిపుణులు అమరావతి అకాడమీ డైరెక్టర్ రాజు అవగాహన కల్పించి విధి విధానాలను వివ‌రించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్‌బి అభ్య‌ర్ధులు పాల్గొని తమ పేర్లను నమోదు చేసుకున్నారు. రెండు నెల‌ల పాటు శిక్ష‌ణ కొన‌సాగుతుంద‌ని తెలిపారు.