Home సినిమా కోర్టును ఆశ్రయించిన ప్రియా ప్రకాష్‌వారియర్‌

కోర్టును ఆశ్రయించిన ప్రియా ప్రకాష్‌వారియర్‌

424
0
Priya Prakash Varrier New Latest HD Photos | Oru Adaar Love Movie Heroine Priya Prakash Varrier Photo Shoot Images

డిల్లీ : క‌ను సైగ‌ల‌తో యువకుల హృదయాలను కొల్లగొట్టిన మలయాళ నటి ప్రియా ప్రకాష్‌ వారియర్‌. ‘ఒరు ఆదార్‌ లవ్‌’లోని ‘మాణిక్య మలయార పూవి’ పాటతో ఒక్కరోజులో ప్రియ ఫేమస్ అయ్యింది. అయితే ఆ పాట ఓ వర్గం ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందంటూ పలువురు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తనపై ఎలాంటి క్రిమినల్‌ చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థాన్ని కోరింది.

ప్రియా ప్రకాష్‌ వారియర్‌, చిత్ర దర్శకుడుపై తెలంగాణ, మహరాష్ట్రల్లో ఓ వర్గం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. హైదరాబాద్‌లోని కొందరు విద్యార్థులు తొలిసారి ఫిర్యాదు చేశారు. తమను కించపరిచేలా పాట ఉందని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ‘ఒరు ఆదార్‌ లవ్‌’ చిత్రంతో పాటు తనపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాల‌ని కోర్టులో ఫిర్యాదు దాఖ‌లు చేసింది.