Home గుంటూరు రొయ్యపిల్లల పెంపకం కేంద్రాలతో భూగర్భజలాలు కలుషితం

రొయ్యపిల్లల పెంపకం కేంద్రాలతో భూగర్భజలాలు కలుషితం

373
0

బాపట్ల : తీరప్రాంత గ్రామాల్లో రొయ్యపిల్లల పెంపకం కేంద్రాలతో భూగర్భజలాలు కాలుష్య మవుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. తీరప్రాంత గ్రామాల ప్రజలు గత కొంతకాలంగా భూగర్భజలాలు కాలుష్యంపై ఆందోళనలు చేపట్టారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ నేపధ్యంలో కాలుష్య నియంత్రణ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు సమావేశం ఏర్పాటు చేశారు.