Home సినిమా ఒక్క‌క్ష‌ణం రాణాను చూసి….

ఒక్క‌క్ష‌ణం రాణాను చూసి….

949
0

హైద‌రాబాద్ : ఒక్క క్ష‌ణం రాణాను చూసి… షాక్ అయ్యా… అచ్చం చంద్ర‌బాబులాగే క‌నిపించిన ద‌గ్గుబాటి రాణాను చూసి ద‌గ్గుబాటి సురేష్ షాక్ అయిన‌ట్లు పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఎన్‌టిఆర్‌ సినిమా తన తండ్రి నందమూరి తారక రామారావు జీవితకథను బయోపిక్‌గా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్‌టిఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టిస్తుండ‌గా ఏపీ సీఎం చంద్రబాబు పాత్రలో ద‌గ్గుబాటి రానా నటిస్తున్నారు.

ఈ సినిమా కోసం రానా బరువు తగ్గాడు. అంతేకాదు చంద్రబాబు హావభావాలను అన్నీటినీ క్షుణ్ణంగా పరిశీలించాడు. ఆత‌ర్వాతే షూటింగ్‌కి సిద్ధమయ్యాడు. షూటింగ్‌లో అచ్చం చంద్రబాబులాగే కనిపిస్తున్నాడు. ఇటీవల షూటింగ్‌ సెట్స్‌కు వెళ్లిన సురేష్ బాబు.. రానాను చూసి షాక్ అయ్యాడ‌ట‌. సురేష్‌బాబు వెళ్లిన స‌మ‌యంలో రానా.. చంద్రబాబులా రానా స్టిల్ ఇస్తుండ‌టం చూసి నమ్మలేకపోయారని ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. ఇటీవల ఒ పిక్ లీకైంది. అందులోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.