Home జాతీయం ఆయిల్ పూల్ వాజపేయి రద్దు చేస్తే… మోడీ రిలయన్స్ కు ధారాదత్తం చేసిన పుణ్యమే…

ఆయిల్ పూల్ వాజపేయి రద్దు చేస్తే… మోడీ రిలయన్స్ కు ధారాదత్తం చేసిన పుణ్యమే…

566
0

అమరావతి : దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశీయ పరిశ్రమలు, ప్రజల రక్షణ కోసం చట్టంలో అనేక భద్రతలు డాక్టర్ అంబెడ్కర్ పొందుపర్చారు. వాటిలో ప్రధానమైనది దేశీయ పరిశ్రమల రక్షణ చట్టం. దీని ప్రకారం జాతీయ ప్రభుత్వ రంగ సంస్థలలో విదేశీ పెట్టుబడులు 49శాతం మించకూడదు. ఎగుమతి పనుల్లో రాయితీలు, విదేశీ వస్తువుల దిగుమతులపై పన్నులు విధించేవారు.

 

వీటితోపాటు దేశంలో ఇంధన వనరులు అంతర్జాతీయ మార్కెట్  ఒడిదుడుకులను తట్టుకునేందుకు వీలుగా ఆయిల్ పూల్ నిధిని ఏర్పాటు చేశారు. ఈ నిధి ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ఆయి ధరలు తగ్గేటే వచ్చేలాభాన్ని ఈ ఖాతాలో ప్రభుత్వం వద్దే ఉండేది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి సమురు ధరలు పెరిగితే ఆయిల్ పూల్ ఖాతాలో నిల్వ ఉన్న నిధులతో కొనుగోలు చేసి ఆయిల్ ధరలను ప్రభుత్వమే నియంత్రణలో ఉంచేందుకు అవకాశం ఉండేది.

1998లో వాజపేయి నాయకత్వంలో అధికారాన్ని వెలగబెట్టిన ఎన్డీయే ఆయిల్ పూల్ ఖాతాను రద్దు చేసింది. ఆనిధిని కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో విలీనం చేశారు. దీంతో ఆయిల్ ధరలను నియంత్రిముచే శక్తిని కేంద్ర ప్రభుత్వం కోల్పోయింది. అప్పటినుండి అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడల్లా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ వచ్చారు. అయినప్పటికీ ధరల నియంత్రణ హక్కు కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉండేది.

2014లో మోడీ నాయకత్వలో అధికారానికి వచ్చిన బిజెపి, ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఆయిల్ ధరల నియంత్రణ హక్కును కూడా వదులుకుంది. ఆయిల్ కంపిణీలతో కూడిన కమిటీకి ఆయిల్ ధరల నియంత్రణ హక్కులను ఇచ్చేసింది. ఈ కమిటీ రోజువారీ ధరలు సమీక్షిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతాయంటే అర్ధరాత్రి నుండే రూపాయల్లో పెంచి అమలు చేస్తున్నారు. తగ్గితే మాత్రం పైసల్లో తగ్గిస్తున్నారు.

ఆయిల్ పూల్ ఉన్న రోజుల్లో లాభం నష్టాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి. వాజపేయి, మోడీ పుణ్యమాని ఇప్పుడు లాభాలొస్తే అంబానీలకు అప్పగించి నష్టాలొస్తే దేశ ప్రజల నెత్తిన రుద్దుతున్నారు. ఆయిల్ పూల్ నిధిని పునరుద్ధరించి పాతపద్దతిలో ధరల నియంత్రణను కేంద్రప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటేనే ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. లేకుంటే ధరల భారం మరింత పెరగక తప్పదు.