చీరాల : మహిళలు ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తారనేందుకు కొత్తపేట జెడ్‌పి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇందిరా ఇస్రాయేలని రోటర్ల క్లబ్ జాయింట్ సెక్రటరీ పివి తులసీరామ్ పేర్కొన్నారు. రోటరీ ఇన్నర్‌వీల్ క్లబ్ ఆధ్వర్యంలో నేషనల్ బిల్డర్ అవార్డును మంగళవారం ఆమెకు పాఠశాల ఆవరణలో అందజేశారు. బోధనా వృత్తితోపాటు వివిధ పాఠశాలల్లో చేపట్టిన సేవా కార్యక్రమాలను ప్రస్తావించారు. ప్రసాదనగర్, వడ్డెసంఘం పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి ఆయా పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య పెంచేందుకు కృషి చేశారని చెప్పారు. అనంతరం ఇన్నర్ వీల్ క్లబ్ ప్రతినిధులు ఆమెను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల అభివృద్ది కమిటి అధ్యక్షులు గవిని నాగేశ్వరరావు, శంభుప్రసాద్, ఎస్‌జిడి ఖురేషి, స్టాఫ్ సెక్రటరీ శ్రీనివాసరావు, ఇన్నర్‌వీల్ ప్రతినిధులు వూరా శ్రీలక్ష్మీఝాన్సీ, పులిగడ్డ నళిని, ఐ సుభాషిణి, బి నీలిమ, పవని భానుచంద్రమూర్తి పాల్గొన్నారు.
పాఠశాలలో బాలికల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఇన్నర్‌వీల్ క్లబ్ నుండి శానిటరీ న్యాప్‌కిన్స్ (రుతురుమాళ్లు), న్యాప్‌కిన్ బర్నింగ్ మెషీన్ (ఇన్సినేటర్) అందజేస్తామని ఇన్నర్ వీల్ క్లబ్‌ప్రతినిధులు ప్రకటించారు.