హైదరాబాద్ : అక్కినేని నాగార్జున – రామ్‌గోపాల్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఆఫీసర్’ టీజర్‌ను నాగ్ ట్విటర్ ద్వారా సోమవారం విడుదల చేశారు. ‘ఆఫీసర్ కోసం వర్మతో పనిచేసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను.’ అని నాగ్ ట్వీట్ చేశారు. టీజర్‌లో నాగ్ ఫైటింగ్ స్టైల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో నాగ్ పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నారు. నారాయణ పసారీ అనే డేంజరస్ పోలీసు అధికారి హత్య కేసును నాగ్ ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఆయనకు కష్టాలు ఎదురవుతుంటాయి. అయినా ఏమాత్రం బెదరకుండా ‘మొదలు పెట్టిన దానిని పూర్తి చేయడం నా బాధ్యత’ అని నాగ్ చెప్తున్న డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.
ఇందులో నాగ్‌కు జోడీగా మైరా సరీన్ నటిస్తున్నారు. చిత్రంలో ఆమెది కూడా పోలీసు పాత్రే. వర్మ సినిమాల్లో ఎప్పుడూ నేపథ్య సంగీతం ఎప్పుడూ హైలైట్‌గా ఉన్నట్లే ఇందులోనూ ఉంది. నాగ్ ఫైట్ చేస్తున్నప్పుడు వచ్చే నేపథ్య సంగీతం కుదిరింది.
‘‘శివ’తో తెలుగు చలన చిత్రసీమ రూపురేఖల్ని మార్చిన కాంబినేషన్ నాగ్ – వర్మ. ప్రస్తుతం ఆఫీసర్ చిత్రంపై అంచనాలు మిన్నంటాయి. వాటిని తప్పకుండా అందుకుంటాం. నాగ్ పాత్ర చిత్రణ, యాక్షన్ దృశ్యాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’ అని చిత్రబృందం తెలిపింది. మే 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.