మర్రిపూడి : మర్రిపూడి పృదులగిరి లక్ష్మినరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్న అభివృద్ది పనులను ఎంఎల్ఎ డోలా బాలవీరాంజనేయస్వామి మంగళవారం పరిశీలించారు. తిరుమల, తిరుపతి దేవస్థానం నుండి మంజూరైన రూ.25లక్షల నిధులతో లక్ష్మినరసింహస్వామి ఆలయ అభివృద్ది పనులు చేస్తున్నారు. పనులను పరిశీలించిన ఎంఎల్ఎ నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని సూచించారు.