హైదరాబాద్ : యంగ్‌టైగర్ ఎన్టీఆర్ మురిసిపోతున్నారు. తన పెద్ద కుమారుడు అభయ్ రామ్‌కు కరాటే నేర్పిస్తున్నాడేమో. నేర్చుకున్న పంచ్‌లను తండ్రిపై ప్రయోగిస్తున్నట్లుంది. అది చూసి మురిసిపోతున్న ఎన్‌టిఆర్ ముఖాన్ని కొడుకు అభయ్‌రామ్‌కు పంచ్ బ్యాగ్‌లా అప్పగించినట్లుంది. కొడుకు అల్లరితో చెంపలపై కొడుకు ఇస్తున్న పంచ్‌లను వీడియోతీసి మరీ ఇన్స్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూస్తుంటే ఎన్‌టిఆర్ కొడుకు అభయ్‌రామ్ ఎంత అల్లరిపిల్లాడో తెలిసిపోతుంది. కొడుకు చేసే అల్లరి చేష్టలను అప్పుడప్పుడు తారక్ వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా కొడుకుతో చెంపలపై పంచ్‌ల వీడియో ఎన్‌టిఆర్ అభిమానులకోసం పోస్ట్ చేసినట్లుంది.
‘నా కుమారుడికి నేను పంచింగ్ బ్యాగ్ అయిన వేళ..’ అంటూ కరాటే కిడ్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో కలిపి తారక్ సరదాగా క్యాప్షన్ ఇచ్చారు. ఈ క్యాప్షన్ చూస్తే అభయ్ కరాటే నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. తారక్, ప్రణతి దంపతులకు ఇటీవల జన్మించిన రెండో కుమారుడికి భార్గవ్ రామ్ అని నామకరణం చేశారు.
ప్రస్తుతం ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంతో ఎన్‌టిఆర్ బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో తారక్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. హారిక – హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్న చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రెండో టీజర్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ రెండో టీజర్ లాంటిది ఏమీ లేదని త్వరలో థియేట్రికల్ ట్రైలర్‌నే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృంధం స్పష్టత ఇచ్చింది. చిత్రాన్ని దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.