Home ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఐటి దాడులు

రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఐటి దాడులు

452
0

అమరావతి : ఐటి దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. తెలుగుదేశం నాయకులు, కాంట్రాక్టర్లు లక్ష్యంగా దాడులు జరుగుతున్నట్లు కనిపిస్తుంది. నారాయణ విద్యాసంస్థలోను ఐ టి అధికారులు దాడులు చేశారు. విద్యార్థుల ఫీజులు సంబంధించిన రికార్డులు, కంప్యూటర్ లు స్వాధీనం చేసుకున్నారు. బీదా మస్తాన్ రావుకు చెందిన చెన్నైలోని ఇంటిలోని ఐ టి అధికారులు సోదాలు చేస్తున్నారు.

శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, విజయవాడ, నెల్లూరు కేంద్రాల్లో ఐటి అధికారులు పక్కా ప్రణాళికతో సుమారు 200మందికిపైగా అధికారులు ఏకకాలంలో దాడులు చేయడం సంచలనం సృష్టిస్తోంది.

అమరావతి కేంద్రంగా భూములు కొనుగోలు చేసిన వారితోపాటు భారీ నిర్మాణాలు చేస్తున్న జైభేరి, లింగమనేని ఎస్టేట్స్, బిఎంఆర్ వంటి వాటితోపాటు రియల్ ఎస్టేట్ కంపిణీలపై దాడులు చేస్తున్నారు. దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా హెచ్చరించినప్పటికి తిపాలు తప్పడంలేదు.