Home క్రైమ్ భార్య పక్కనుండగా… మరో యువతిపై లైంగిక….

భార్య పక్కనుండగా… మరో యువతిపై లైంగిక….

436
0

– విమానంలో భారత ఐటీ మేనేజరు కిచకపని
– డెట్రాయిట్‌ కోర్టులో ముద్దాయి

వాషింగ్టన్‌ : అతనో ఐటి కంపినిలో మేనేజర్. అమెరికాలోని రోచేస్తర్ హిల్స్ సిటీలో ఓ ఐటి కంపినిలో మేనేజరుగా పనిచేస్తున్నాడు. ఎదునేలాల క్రితం తన భార్యతో కలిసి విమాన ప్రయాణంలో జరిగిన ఘటన విచారణ పూర్తిచేసుకుంది. విమానంలో భార్య ఒకవైపు సీట్లో కూర్చోగా తన పక్క సీటులో మరో 22ఏళ్ల యువతి కూర్చొని నిద్రపోతొంది. అదే సమయంలో యువతిపై లైంగిక చర్యలకు పాల్పడినట్లు తేలింది!

డెట్రాయిట్‌ జిల్లా న్యాయస్థానం విచారించి అతడిని దోషిగా తేల్చింది. డిసెంబరు 12న అతనికి శిక్ష విధించనున్నట్లు సమాచారం. భారత్ కు చెందిన రమణమూర్తి అమెరికాలోని రోచెస్టర్‌ హిల్స్‌ సిటీలో నివాసం ఉంటూ ఓ ఐటీ సంస్థలో మేనేజరుగా పనిచేస్తున్నాడు. ఏడు నెలల క్రితం తన భార్యతో కలిసి లాస్‌వేగాస్‌లో డెట్రాయిట్‌ వెళ్ళేందుకు స్పిరిట్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఎక్కాడు. తనకు ఓవైపు భార్య… మరోవైపు 22 ఏళ్ల యువతి కూర్చున్నారట. విమాన ప్రయాణంలో కాసేపటికి నిద్రకు ఉపక్రమించిన యువతిపై రమణమూర్తి లైంగిక చర్యలకు పాల్పడ్డారు.

‘‘లేచి చూస్తే తన దుస్తుల బొత్తాలు విప్పి ఉన్నాయి. రహస్య భాగాలపై మూర్తి చేతులు తడుముతూ కనిపించాయి. అంతే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. వెంటనే విమాన సిబ్బందిని అప్రమత్తం చేశాను’’ అని బాధితురాలు ఆరోపించింది. ఈ వ్యవహారంపై ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు విచారణ చేశారు. మొదట రమణమూర్తి ఆ సమయంలో తాను గాఢంగా నిద్రపోతున్నాననీ, తనకేం తెలియదంటూ దబాయించాడు. అయితే పోలీసులు లోతుగా ప్రశ్నించేసరికి… చేయకూడనిది చేసి ఉంటానని తప్పు అంగీకరించాడు. సాక్ష్యాధారాలను మిచిగాన్‌లోని డెట్రాయిట్‌ న్యాయస్థానం పరిశీలించి ఇటీవల అతడిని దోషిగా తేల్చింది.