Home క్రైమ్ స్టార్ హోటల్లో పోలీస్ రైడింగ్… భోజపురి నటి?

స్టార్ హోటల్లో పోలీస్ రైడింగ్… భోజపురి నటి?

490
0

హైదరాబాద్‌ : స్టార్‌ హోటల్‌ టాస్క్ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న భోజ్‌పురి నటిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు హర్యాణా గుర్‌గావ్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి, నిర్వాహకుడిని పట్టుకున్నారు.

బంజారాహిల్స్‌లోని ఐదు నక్షత్రాల హోటల్‌లో వీరంతా పోలీసులకు దొరికారు. భోజ్‌పురి నటితోపాటు నిర్వాహకుడు జనార్దన్‌రావు, విటుడైన ప్రభుత్వ ఉద్యోగి అమిత్‌ మహేంద్ర శర్మ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.40 వేలు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.