Home బాపట్ల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిభిరం

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిభిరం

33
0

వేటపాలెం (Vetapalem) : స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆవరణలో వాసవి, వనితా, వైష్ణవి క్లబ్‌ (Vasavi, Vanitha, Vyshnavi club) ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత షుగర్ వైద్య శిబిరం, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, మానసిక వికలాంగులకు కిట్లు, గ్రామంలో సిమెంట్ బల్లలు ఏర్పాటు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరాన్ని క్లబ్‌ గవర్నర్ అన్నం సాయి సునీత, కోఆర్డినేటర్ చందా వెంకట స్వామి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న 1600 వాసవి క్లల్‌ల ఆధ్వర్యంలో రూ.45కోట్ల విలువైన సేవా కార్యక్రమాలు ఈ ఒక్కరోజే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాసవి, వనిత క్లబ్ ప్రతినిధులు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. షుగర్ ఉన్నవారు తప్పనిసరిగా ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామం చేస్తూ ఉండాలని వైద్యులు సూచించారు.

ఏడాదికి ఒకసారి గుండె, కళ్ళు, కిడ్నీ పరీక్షలు చేయించుకుంటూ క్రమం తప్పకుండా మందులు వాడాలని చెప్పారు. తెల్ల కార్డు ఉన్నవారికి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కిడ్నీ, జనరల్, చెవి, ముక్కు గొంతు, ఎముకల ఆపరేషన్లు తమ హాస్పిటల్‌లో ఉచితంగా చేస్తున్నామని శ్రీకామాక్షి కేర్‌ హాస్పిటల్‌ షుగర్ స్పెషలిస్ట్ డాక్టర్ చిమటా దివ్య తెలిపారు. కార్యక్రమంలో కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ తాడివలస దేవరాజు, చక్క ఇందుమతి, తాత సుజాత, ప్రెసిడెంట్ శ్రీరామ్ బాబ్జీ, సతులూరి వెంకట రమేష్, మువ్వల కోటేశ్వరరావు, వనితా, వైష్ణవి క్లబ్‌ ప్రెసిడెంట్ నూకల సీతామహాలక్ష్మీ, చుండూరు రాజ్యలక్ష్మీ, పోలిశెట్టి వంశీప్రియ, రామ లింగేశ్వరరావు, పవన్ కుమార్, గోవర్ధన్, ప్రసాద్, రమేష్ పాల్గొన్నారు.